Share News

రామగుండంలో నిలిచిపోయిన ఉచిత ఇసుక

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:02 AM

రామగుండం నియోజకవర్గంలో ఉచిత ఇసుక సరఫరా నిలిచిపోయింది. నాలుగు నెలల క్రితం జిల్లా యం త్రాంగం గోదావరి నది నుంచి ఇసుక తీయకుండా ర్యాంపులకు అడ్డంగా కందకాలు తవ్వింది. ఇసుక పక్కదారి పడుతుందనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించి గోదావరి నుంచి స్థానిక అవసరాలకు ఇసుక తీసుకెళ్లే రీచ్‌లను మూసివేయించారు.

రామగుండంలో నిలిచిపోయిన ఉచిత ఇసుక

కోల్‌సిటీ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గంలో ఉచిత ఇసుక సరఫరా నిలిచిపోయింది. నాలుగు నెలల క్రితం జిల్లా యం త్రాంగం గోదావరి నది నుంచి ఇసుక తీయకుండా ర్యాంపులకు అడ్డంగా కందకాలు తవ్వింది. ఇసుక పక్కదారి పడుతుందనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించి గోదావరి నుంచి స్థానిక అవసరాలకు ఇసుక తీసుకెళ్లే రీచ్‌లను మూసివేయించారు. నెల రోజుల క్రితం వరకు గోదావరికి వరదలు ఉండగా ప్రస్తుత వరదలు తగ్గుముఖం పట్టాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేకపోవ డంతో ధరలు పెరిగిపోయాయి. గతంలో రూ.1000నుంచి రూ.1500 ట్రాక్టర్‌ ఇసుక లభించగా ఇప్పుడు రూ.3000లకు చేరింది. అంతర్గాం, మేడి పల్లి, లింగాపూర్‌, మల్కాపూర్‌ ఇసుక రీచ్‌లు బంద్‌ అయ్యాయి. గతంలో ఉన్న నిల్వలనే నిర్మాణాలకు వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగరేణి, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌, పంచాయతీరాజ్‌, తదితర విభాగాలకు చెందిన అభివృద్ధి పనులక ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగం పుంజుకున్న పరిస్థితుల్లో ఇసుక దొరకక పోవడంతో నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరిఖని, ఎన్‌టీపీసీ, రామగుండంలలో ఇసుక, మట్టి రవాణాపై 200ట్రాక్టర్లు ఆధార పడ్డాయి. ఒక్క గోదావరిఖనిలోనే 100ట్రాక్టర్లు ఉన్నాయి. ఐదు నెలలుగా గిరాకీలు లేక ట్రాక్టర్ల లేబర్లు, డ్రైవర్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఖనిలో ట్రాక్టర్ల యజమానుల ర్యాలీ

కోల్‌సిటీ/జ్యోతినగర్‌, (ఆంధ్రజ్యోతి): రామగుండంలో నిలిచిపోయిన ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించాలని శుక్రవారం ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని బాపూజీనగర్‌లోని అసోసియేషన్‌ కార్యాలయం నుంచి అధ్య క్షుడు దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌ చౌరస్తా, మున్సిపల్‌ జంక్షన్‌ మీదుగా ఎన్‌టీపీసీ రామగుండం వరకు నిర్వహించారు. ఎన్‌టీపీసీ రామగుం డం ట్రాక్టర్ల యజమానులు ర్యాలీలో పాల్గొన్నారు. ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించాలని, ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవ ర్లు, లేబర్లకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ చొరవ చూపాలని కోరారు. ఎన్టీపీసీ, రామగుండం, కుందనపల్లి, గోదావరిఖని ట్రాక్టర్‌ యజమానులు గొడుగు శ్రీనివాస్‌, శివ కుమార్‌, మేకల పోశం, కుమార్‌, సంపతిచౌదరి, పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:02 AM