అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:30 AM
ప్రజాపా లనలో ప్రజలకు పలు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. గురు వారం శివపల్లిలో రూ.30 లక్షలు వెచ్చించి సిమెం టు రోడ్లు, ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఎలిగేడు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజాపా లనలో ప్రజలకు పలు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. గురు వారం శివపల్లిలో రూ.30 లక్షలు వెచ్చించి సిమెం టు రోడ్లు, ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా అమలు చేస్తున్నామన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు పొంతన లేని మాటలతో ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారన్నారు. దుగ్యాల సంతోష్‌రావు, దుగ్యాల రాంచందర్ రావు, అమ్ముల ఓదెలు, కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, అమ్ముల రాజు, అర్షనపల్లి వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.