ఆర్‌జీ-1 ఏరియాలో వన మహోత్సవం
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:39 AM
సింగరేణి ఆర్‌జీ-1 ఏరియాలో ఆదివారం జీడీకే ఓసీపీ-5 సివిల్ డిపార్ట్‌మెంట్ ఫిల్టర్ బెడ్ సమీపంలో వన మహోత్సవ కార్య్రకమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ముఖ్యఅతిథిగా హాజరై వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 500 మొక్కలను నాటడం జరిగినది.
గోదావరిఖని, జూలై 6(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆర్‌జీ-1 ఏరియాలో ఆదివారం జీడీకే ఓసీపీ-5 సివిల్ డిపార్ట్‌మెంట్ ఫిల్టర్ బెడ్ సమీపంలో వన మహోత్సవ కార్య్రకమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ముఖ్యఅతిథిగా హాజరై వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 500 మొక్కలను నాటడం జరిగినది. ఈ సందర్భంగా సీఎండీ బలరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించటం గొప్ప కార్యక్రమమన్నారు. మొక్కలు మానవాళికి ప్రాణవాయువు అని, మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం వల్ల భావితరాలకు ఎంతో మేలు చేసిన వారమవుతామన్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని తెలిపారు. సింగరేణి యాజమాన్యం పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని పర్యవేక్షిస్తున్నారని అభినందించారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌జీ-1 డీ లలిత్ కుమార్ మాట్లాడుతూ వన మహోత్సవ గొప్ప కార్యక్రమమని, సీఎండీ అందరినీ ప్రోత్సహిస్తూ వన మహోత్సవ యజ్ఞంలో అంకుటిత దీక్షతో ఇప్పటి వరకు 19570మొక్కలను నాటడం గొప్ప విషయమన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారన్నారు. వన మహోత్సవ కార్యక్రమం చేపట్టిన సీఎండీ బలరాంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డుతో సత్కరించారని తెలిపారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ మహోత్సవంలో సీఎంఓఎఐ అధ్యక్షులు బీ మల్లేష్, ఏఐటీయూసీడిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సేవా అధ్యక్షురాలు అనిత లిలిత్ కుమార్, ఎస్‌ఓటూ జీఎం ఆంజనేయప్రసాద్, డీజీఎం(ఫారెస్ట్) కర్ణ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, నాయకులు కే.స్వామి, ఆరెల్లి పోషం, అధికారులు నాగుల వేణు, హనుమంతరావు, ఇతర ఏరియా జీఎంలు ఏజెంట్లు, మేనేజర్లు పాల్గొన్నారు.