తుది విడత ముగిసిన నామినేషన్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:56 PM
పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసింది. శనివారం నామినే షన్ల పరిశీలన, 9న అభ్యర్థుల ఉపసంహరణ జరగనుంది. సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి సర్పంచ్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో నామిని రాజిరెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఈనెల 17న పోలింగ్ జరగనుంది. మండలాల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దపల్లి రూరల్, డిసెంబరు 5 (ఆంఽధ్రజ్యోతి) : మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 120 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయగా, 464 మంది వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు చేసినట్లు ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ తెలిపారు. అయితే మూడోవ విడతలో భాగంగా మూడు రోజులుగా 30 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 207 సర్పంచ్‌లకు, 294 వార్డు స్థానాలకు 830 నామినేషన్‌లు దాఖలు అయినట్లు ఎంపీడీవో తెలిపారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మండలంలోని నారా యణరావుపల్లి సర్పంచ్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో నామిని రాజిరెడ్డి ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల చివరి రోజు శుక్రవారం భారీగా నామినేషన్ల దాఖలయ్యాయి. మండలంలో 27 గ్రామపంచాయతీలకు 200 నామినేషన్లు, 262 వార్డు స్థానాలకు 682 నామినేషన్లు దాఖల య్యాయి. శుక్రవారం ఒకరోజే సర్పంచ్‌కు 123, వార్డులకు 420 నామినే షన్ల వచ్చాయి. కాగా బొంతకుంటపల్లి గ్రామంలోని 3వ వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): మండలంలో 22 గ్రామాల్లో సర్పంచ్‌లకు, 198 వార్డులకు నామినేషన్లు ముగిసాయి. రెండు రోజుల్లో సర్పంచ్‌లకు 49, వార్డులకు 169 నామినేషన్లు వచ్చాయి. కాగా శుక్రవారం భారీగా నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్‌కు 107, వార్డు స్థానాలకు 385 దాఖలు కాగా, మొత్తం సర్పంచ్‌కు 156, వార్డు స్థానాలకు 554 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో తెలిపారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని 12 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులకు మూడు రోజుల్లో 82 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 114 వార్డు స్థానాలకు 299 మంది నామినేషన్లు సమర్పించారు.