Share News

బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:41 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌ రావు ఎదుటే పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కమాన్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు.

బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

పెద్దపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌ రావు ఎదుటే పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కమాన్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రచార రథం ఎక్కగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో క్రేన్‌ ద్వారా గజ మాలను వేశారు. ఆ వాహనంపై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామ కృష్ణారెడ్డి లేకపోవడంతో ఆయన అనుచరులు ప్రచారం రథం నుంచి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ను దించాలని ఆందోళనకు దిగారు. ప్రదీప్‌ కుమార్‌ వర్గీయులు కూడా ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల నాయకులు, కార్యక ర్తల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. దీంతో వారిని నివారించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగి ర్యాలీ ముందుకు సాగింది. ఎన్‌బీ గార్డెన్‌లో నిర్వహించిన సభా వేదిక వద్ద కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. వేదిక మీదకు కొందరిని పిలవక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు నాయకులు వేదిక మీద ఉండడంతో వాళ్లను దించే వరకు ఆయా వర్గాల నాయకులు, కార్యకర్తలు ఊరుకో లేదు. అనంతరం పోలీసుల పహారాలో కార్యకర్తల సమావేశం జరిగింది. నాయకులు, కార్యకర్తలు తోపు లాటకు దిగడం, వేదిక వద్ద వాదులాడుకోవడాన్ని చూసిన రాష్ట్ర అధ్యక్షుడు కొంత అసంతృప్తికి లోనై ప్రసంగాన్ని త్వరగానే ముగించారు. ఆయన ప్రసంగించే సమయానికి సమావేశానికి వచ్చిన కార్యకర్తలు వెళ్లి పోవడం కనిపించింది. జిల్లాలో బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై ‘కమలంలో కలహాలు’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్‌లో ఈ నెల 5వ తేదీన ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని వ్యాఖ్యానించ డాన్ని అక్కడున్న పార్టీ కార్యకర్తలు ముక్కున వేలేసు కున్నారు. అప్పటికే కమాన్‌ నుంచి నిర్వహించిన ర్యాలీ లో, వేదిక వద్ద తోపులాట, వాగ్వాదాన్ని కార్యకర్తలు గమనించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు చీకటి ఒప్పం దాలతో కలిసి పోయారని విమర్శిస్తూనే మన పార్టీలో వర్గ విభేదాలు ఎందుకని జిల్లా అధ్యక్షుడు ప్రశ్నించడం గమనార్హం. రాష్ట్ర అధ్యక్షుడి ముందే ఇద్దరు కలిసి పోవాలని సూచించారు. అయితే గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌లు ఇద్దరు పక్కపక్కనే కూర్చు న్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను, ప్రదీప్‌ను ఓడగొడితిరి... ఇప్పుడేమో ఈలలు కొడుతున్నారా’ అని గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడడం కొసమెరుపు.

Updated Date - Aug 06 , 2025 | 12:41 AM