పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:18 AM
పండుగలు శాం తియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం కమిషనరేట్‌లోని హెడ్ క్వార్టర్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని మతాల పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కోల్‌సిటీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పండుగలు శాం తియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం కమిషనరేట్‌లోని హెడ్ క్వార్టర్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని మతాల పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని, గతేడాది పెద్దపల్లి జోన్ పరిధిలో 2476 విగ్రహాలు ఏర్పాటు చేశారని, వాటి సంఖ్య ఈ ఏడాది పెరిగే అవకాశం ఉందన్నారు. అన్ని వివరాలతో పోలీస్‌స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని, నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా జియో ట్యాగింగ్ చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరుగకుండా శోభాయాత్ర సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. గణపతి మండపం కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలని, పాయింట్ బుక్ ఏర్పాటు చేసి బ్లూకోల్డ్స్, పెట్రోకార్ తనిఖీలు చేస్తారన్నారు. లక్కీ డ్రాలు నిర్వహించకూడదని, బలవంతపు చందాలు వసూలు చేయరాదన్నారు. విద్యుత్‌శాఖ అనుమతి తీసుకో వాలని, విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టుప క్కన, నిమజ్జనం వెళ్లే దారుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.
కొందరు సోషల్ మీడి యాలో అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతిసేలా పోస్టింగ్ పెట్టే అవకాశం ఉందని, ప్రజలు నమ్మవద్దని, లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరిం చారు. శోభాయాత్ర సమయంలో పోలీస్‌శాఖ రోడ్ మ్యాప్‌ను అనుసరించాలని, శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే డయల్ 100 లేదా కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన 8712656597 సంప్రదించాలని కోరారు. పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు కరుణాకర్, భాస్కర్, ఏసీపీలు మల్లారెడ్డి, మడక రమేష్, ఆరె వెంకటే శ్వర్లు, ప్రకాష్, రవికుమార్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు, ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ భీమేష్ పీస్ కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.