Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:13 AM

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ీఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ల సందీప్‌, జిల్లాల ప్రశాంత్‌ లు మాట్లాడుతూ విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, విద్యా శాఖ మంత్రిని నియమించాలని డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ీఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ల సందీప్‌, జిల్లాల ప్రశాంత్‌ లు మాట్లాడుతూ విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, విద్యా శాఖ మంత్రిని నియమించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల పై చదువులకు సర్టిఫికెట్లను ఇవ్వాలన్నారు. పెండింగ్‌ లో ఉన్న మెస్‌ కాస్మోటిక్‌ చార్జీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రంలో బాలికల జూనియర్‌ కళాశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని, బాలికల ఎస్సీ, ఎస్‌ఎంఎస్‌ కాలేజ్‌ హాస్టల్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజ్‌ కుమార్‌, జిల్లా కమిటీ సభ్యుడు ఆదిత్య నాయకులు నరేష్‌,అభి, అక్షయ, శ్రావ్య, మానస విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:13 AM