ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:51 PM
విద్యార్థుల ఫీజు బకా యిలను విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్‌వీ నాయకులు ముట్టడించారు.
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజు బకా యిలను విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్‌వీ నాయకులు ముట్టడించారు. బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీష్‌గౌడ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యను సీఎం రేవంత్‌రెడ్డి దూరం చేస్తున్నాడన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు బకాయిలను వెం టనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖను తనవద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి రూ.10 వేల కోట్ల బకాయిలను ఎం దుకు విడుదల చేయడం తెలుపాలన్నారు. నిధులు విడుదల చేయ కుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, నూనెటి కుమార్ యాదవ్, మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, సిలివేరి లవన్ కుమార్, కర్ర దేవెందర్ రెడ్డి, ఖాదర్, ఉప్పు శివ కుమార్, బండి సురేష్, పాల్గొన్నారు.