Share News

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:10 AM

మొంథా తుఫాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టం అంచనా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్‌ నాయకులు మీస అర్జున్‌ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్‌ రెడ్డి, నల్ల మనోహర్‌ రెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు.

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సుల్తానాబాద్‌/కాల్వశ్రీరాంపూర్‌/ఓదెల, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టం అంచనా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్‌ నాయకులు మీస అర్జున్‌ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్‌ రెడ్డి, నల్ల మనోహర్‌ రెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు. మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ కురిసిన అకాల వర్షం కారణంగా వేల ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.40 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కటింగ్‌ లేకుండా కొనాలని డిమాండ్‌ చేశారు. నల్లగింజ, తేమ ఉన్నా, రైసుమిల్లర్లు వెనక్కి పంపకుండా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి పరిహారం ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. గతంలో రైతు నాయకుడిగా తిరిగిన ఎమ్మెల్యే విజయరమణరావు ఇప్పుడు రైతుల కష్టాలను పట్టించుకోకుండా, జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సౌదరి మహేందర్‌ యాదవ్‌, అమరగాని ప్రదీప్‌ కుమార్‌, నాయకులు ఎర్రంశెట్టి మునీందర్‌, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌, పెర్క రమేష్‌, రామకృష్ణ, మారం రమేష్‌, రామకృష్ణ, మల్కా భాగ్యలక్ష్మి, భూసారపు సంపత్‌, ఎర్రం సంతోష్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, శశివర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.వ్యక్తం చేశారు.

Updated Date - Nov 01 , 2025 | 12:10 AM