Share News

మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:21 PM

’మేం చదును చేసుకుంటే... మీరు మట్టి తీస్తారా‘ అంటూ పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుం డ్లపల్లి రైతులు నిలదీశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే పనులకు సం బంధించి మట్టి తవ్వకాల కోసం శనివారం వచ్చిన వారిని రైతులు అడ్డుకు న్నారు.

మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

ముత్తారం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ’మేం చదును చేసుకుంటే... మీరు మట్టి తీస్తారా‘ అంటూ పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుం డ్లపల్లి రైతులు నిలదీశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే పనులకు సం బంధించి మట్టి తవ్వకాల కోసం శనివారం వచ్చిన వారిని రైతులు అడ్డుకు న్నారు.

ధాన్యం ఆరబెట్టుకునేందుకు గ్రామంలో ఎక్కడా స్థలం లేకపోవ డంతో రైతులమంతా ఎకరానికి తలా రూ.100 చొప్పున పోగు చేసి గ్రామ పరిధిలోని గుట్ట సమీపంలో చదును చేసుకున్నామని తెలిపారు. అయితే తాము చదును చేసుకున్న స్థలంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోగా గ్రీన్‌ఫీల్డ్‌ నేష నల్‌ హైవే పనుల కోసం సంబంధిత వ్యక్తులు యంత్రాలతో వచ్చారు. తాము ఆరబెట్టుకున్న ధాన్యం స్థలంలో మట్టి ఎలా తోడుతారంటూ ప్రశ్నించారు. ఇదే ప్రాంతంలో మట్టి తీసుకునేందుకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాచారం అందుకు న్న ఎస్‌ఐ రవికుమార్‌ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు వినకపోవడంతో మట్టి తవ్వకాల కోసం వచ్చిన వారు వెనుతిరిగారు.

Updated Date - Nov 22 , 2025 | 11:21 PM