రైతులు నానో యూరియాను ఉపయోగించాలి
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:02 AM
మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం అంతర్గాం, ధర్మారం, రామగుండం, పాలకుర్తి మండలాల డీల ర్లకు, అభ్యుదయ రైతులకు నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్ మాట్లా డుతూ నానో యూరియాను వాడి రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలన్నారు.
పాలకుర్తి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం అంతర్గాం, ధర్మారం, రామగుండం, పాలకుర్తి మండలాల డీల ర్లకు, అభ్యుదయ రైతులకు నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్ మాట్లా డుతూ నానో యూరియాను వాడి రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలన్నారు. రామ గుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి మాట్లాడుతూ నానో యూరియా అన్ని పంటలపై సమర్ధవంతంగా పని చేస్తుందని ఇఫ్కో జిల్లా మేనే జర్ బాలాజి అన్నారు. రైతులు ఘన రూపంలో ఉన్న యూరియాను వాడకం దగ్గించి ద్రవ రూపం లో ఉన్న నానో యూరియాను ఉపయోగించా లన్నారు.
నానో ఎరువుల వాడకం వల్ల రైతులకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట దిగు బడికి ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసా య అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రసుత్తం ఖరీ ఫ్ సీజన్‌లో వరి పంటతోపాటు పత్తి, మొక్కజొన్న తదితర పంటలపై నానో యూరియాను సమపా ళ్లలో పిచికారి చేయాలని సూచించారు. పంటకు పోషకాలతోపాటు భూసారం పెరుగుతుందన్నారు. రైతులు నానో యూరియా పిచికారి చేసి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సహాయ వ్యవసా య సంచాలకులు శ్రీనాథ్, రామగుండం ఉద్యావన శాఖ అధికారి జ్యోతి, మండల వ్యవసాయ అధికా రులు సతీష్, ప్రకాష్, భాస్కర్, ప్రమోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.