వ్యవసాయ అనుబంధ ఆదాయంపై రైతులు ఆసక్తి చూపాలి
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:22 AM
రైతులు వ్యవసాయంపైనే ఆధార పడకుండా ఇతర అనుబంధ ఆదాయాలపై ఆసక్తి చూపాలని జాతీయ మాంస పరిశోధన సంస్థ సంచాలకులు ఎస్‌బి బార్ బుద్దే అన్నారు. కాట్నపల్లి రైతువేదికలో గురువారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
సుల్తానాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయంపైనే ఆధార పడకుండా ఇతర అనుబంధ ఆదాయాలపై ఆసక్తి చూపాలని జాతీయ మాంస పరిశోధన సంస్థ సంచాలకులు ఎస్‌బి బార్ బుద్దే అన్నారు. కాట్నపల్లి రైతువేదికలో గురువారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. బుద్దే మాట్లాడుతు రైతులు వ్యవసాయం పైనే ఆఽధారపడకుండా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టాలని ఇందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ప్రధాన శాస్త్రవేత్త బాబ్జీ మాట్లా డుతు రైతులు మాంసాన్ని, గుడ్లను ఇచ్చే జంతువులను పెంచుకోవాలని, తద్వారా ఆర్థిక చేయూత పొందాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి మాట్లాడుతు వరి పండించే రైతులు విత్తనం ఎంపిక చేసుకోవడమే కీలక మన్నారు. స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తూ పత్తి పంట యాజమాన్య పద్ధతులు, ఆయిల్‌పామ్ సాగు గురించి వివరించారు. జిల్లా పశుసంవర్థక శాఖ అఽధికారి డాక్టర్ శంకర్ మాట్లాడుతు పాడి పరిశ్రమ అభి వృద్ధి, పెరటి కోళ్ల పెంపకంపై కేంద్రం అందించే సబ్సిడీలు ప్రోత్సాహాకాలను తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ కన్నకి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, కేవీకే హెడ్ డాక్టర్ శ్రీనివాస్, ఉద్యానవన శాస్త్రవేత్త భాస్కర్ రావు మాట్లాడారు. శాస్త్రవేత్తలు వినోద్ కుమార్, నవ్య, ఏడీఏ శ్రీనాథ్, ఇఫ్కో జిల్లా అధికారి బాలాజీ, ఏఈఓలు పద్మ, ప్రశాంత్,స్వప్న తదితరులు రైతులు పాల్గొన్నారు.