యూరియా కోసం రైతుల పడిగాపులు
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:38 AM
ధర్మారం మండల కేంద్రంలో గల సింగిల్ విండో కార్యాలయానికి శుక్రవారం యూరియా కోసం రైతులు తరలివచ్చారు. రైతులు వంద లాదిగా తరిలిరావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక లారీలో 340బస్తాలు రావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 170మంది రైతులకు అందించారు.
ధర్మారం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ధర్మారం మండల కేంద్రంలో గల సింగిల్ విండో కార్యాలయానికి శుక్రవారం యూరియా కోసం రైతులు తరలివచ్చారు. రైతులు వంద లాదిగా తరిలిరావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక లారీలో 340బస్తాలు రావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 170మంది రైతులకు అందించారు. క్యూలో ఉండి జిరాక్స్ కాపీలు ఇచ్చిన రైతులకు అధికా రులు పంపిణీ చేశారు. యూరియా దొరకని మిగిలిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరి గారు. బీఆర్‌ఎస్ నాయకులు రాసూరి శ్రీధర్, గుర్రం మోహన్‌రెడ్డి, కోమడిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు రైతులకు మద్దతుగా నిలువగా, అప్పటికే లైన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులను పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ రైతులు తెలపుగా, 10 సంవత్సరాల పాలనలో ఏనాడు రైతులను ఇబ్బంది పెట్టలేదని, యూరియా కోసం క్యూలో ఉండే పరిస్థితి బీఆర్‌ఎస్ హయాంలో రాలేదని బదులి చ్చారు. ఇలా మాటా మటా పెరిగి గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్‌తో కలిసి యూరియా కొరతపై ప్రెస్‌మీట్ పెట్టారు. యూరియా కొరతకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో కటింగ్ పేరుతో కొప్పుల ఈశ్వర్ రైతులను నిండా ముంచి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత తీర్చేందుకు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ అధికారులతో సమీక్షిస్తున్నారని, రైతులు అధైర్యపడవద్దన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సహ కార సంఘం ఎదుట యూరియాకోసం రైతులు క్యూకట్టారు. ధూళికట్ట సహకార సంఘం ఆధ్వర్యం లో కాచాపూర్‌లో ఏర్పాటుచేసిన యూరియా పంపి ణీ కేంద్రం వద్ద రైతులు ఉదయం నుంచే బారులు దీరారు. కాచాపూర్‌లో 300యూరియా బస్తాలు ఉం డగా సుమారు 400 మందికి పైగా వచ్చారు. దీంతో రైతుల మధ్య కొంత తోపులాట చోటుచేసుకుంది. అధికారులు మరో 150 బస్తాలను తెప్పించి రైతు లకు అందజేశారు. మండల వ్యవసాయ అధికారి అందుబాటులో ఉండడంలేదని, సహకార సంఘాల చైర్మన్ల సమన్వయ లోపంతోనే యూరియా కష్టాలు నెలకొ న్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే రైతులకు యూరియా కొరత ఏర్పడిం దని, పంటలను పండించడం కష్టమని రైతులు ఆరోపిం చారు. సహకార సంఘం సీవో సురేష్‌ను వివరణ కోరగా సహకార సంఘం పరిధిలోని రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంఘం పరిధి లో లేని అబ్బాపూర్ రైతులకు యూరియా ఇవ్వకపోవ డంతో ఇబ్బందిపడ్డారు. రైతులకు యూరియాను అందుబా టులో ఉంచేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.