యాసంగి సాగుకు రైతన్నల సమాయత్తం
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:01 AM
యాసంగి పంటల సాగు కోసం రైతన్నలు సమా యత్తం అవుతున్నారు. రైతులు వారి కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా వ్యవసాయ పనులతో పొలాల వద్ద బిజీ బిజీగా ఉంటున్నారు.
సుల్తానాబాద్ డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటల సాగు కోసం రైతన్నలు సమా యత్తం అవుతున్నారు. రైతులు వారి కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా వ్యవసాయ పనులతో పొలాల వద్ద బిజీ బిజీగా ఉంటున్నారు. తమ పొలాలను దుక్కులను దున్నడానికి యోగ్యంగా సాగు కోసం వ్యవసాయ పనుల్లో నిమగ్నమ య్యారు. మరికొందరు రైతులు ఇండ్ల వద్ద నారుమ డులు పోసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు రైతు లు నాట్ల ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు. పోయిన సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ప్రాంతంలోని బావులు కుంటలు, చెరువులు కుం టలు ఇట్లా సాగునీటి వానలు అన్నీ నీటితో నిం డుకొని ఉన్నాయి. దీంతో రాబోయే యాసంగి సీజ న్‌లో పంటలకు సరిపడా సాగునీరు అందుతుందనే భరోసాలో రైతన్నలు ఉన్నారు. సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో ఈసారి కూడా రైతులు వరి పంట వైపే మొగ్గుచూపుతున్నారు. అందుకు తగినట్లుగా వరి సాగు కోసం అన్ని ఏర్పాట్లు చేసు కుంటున్నారు. వారం రోజుల నుంచి మడులను దుక్కులు కోసం యోగ్యంగా చేయడానికి నీళ్లు నింపి ఉంచుతున్నారు. దున్నడం పూర్తవడంతో నాట్ల కార్యక్రమాన్ని చేపట్టున్నారు. జిల్లా రైతులకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రాంత రైతులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా అందే సాగునీటి ఆధారంగానే పంటలు సాగు చేస్తున్నారు.
పెద్దపెల్లి సుల్తానాబాద్ ప్రాంతానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డి86 ప్రధాన కాలువ ద్వారా పుష్కలంగా ప్రతి సీజన్లో రెండు పంటలకు సాగునీరు అం దుతుంది. అలాగే పెద్దపెల్లితోపాటు మంథని ప్రాం తంలో డి183 ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ రెండు ప్రధాన కాలువల ద్వారా అందే సాగునీరుతో జిల్లాలో లక్షన్నరకు పైగా వంటలు సాగు చేస్తారని అంచనా. మరోవైపు సుల్తానాబాద్ ప్రాంతంలో రైతులు ఎక్కువగా కరెంటు మోటార్ల ఆధారంగా కూడా సాగు చేస్తారు కాలువల నీరు అందుబాటులో లేనప్పుడు మోటార్ల ద్వారా సాగు చేస్తారు. అయితే కొందరు మోటార్లు కలిగిన రైతులు ముందుగానే నార్లు పోసుకొని నాట్ల కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. జిల్లాలో ప్రధానం గా వరి పంటతోపాటు మొక్కజొన్న, పత్తి, కూరగా యలు సాగు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆయి ల్‌పామ్ పంటల సాగుపై విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు పెద్ద ఎత్తున సబ్సిడీలు ప్రకటిం చడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో రెండు లక్షల నలభై వేల ఎకరాలలో సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.