యూరియా కోసం రైతుల క్యూ
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:53 PM
అప్ప న్నపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనగర్తి ఎరువుల గోదాం వద్ద యూరి యా కోసం సోమవారం రైతులు బారులు తీరారు. ఎక రానికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని, కనీసం మూడు బస్తాలైనా ఇవ్వాలని రైతులు పేర్కొన్నారు.
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అప్ప న్నపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనగర్తి ఎరువుల గోదాం వద్ద యూరి యా కోసం సోమవారం రైతులు బారులు తీరారు. ఎక రానికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని, కనీసం మూడు బస్తాలైనా ఇవ్వాలని రైతులు పేర్కొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): రైతులకు సరిపడే యూరి యా అందుబాటులో ఉన్నదని, ఎలాంటి అపోహలకు గురికావద్దని మండల వ్యవసాయ అధికారి ఉమాపతి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పీఎసీఎస్ గోదాంలో ఎరువులను అందించామని ఆయన తెలిపారు. ఖరీఫ్‌లో 1500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అదులో 980 మెట్రిక్ టన్నుల యూరియాను ముందుగానే రైతులకు అందించినట్లు ఆయన వివరించారు.