Share News

రైతులు ఆందోళన చెందవద్దు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:22 PM

తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనిపించే బాధ్యత తనదేనని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు.

 రైతులు ఆందోళన చెందవద్దు

సుల్తానాబాద్‌, నవంబరు2(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనిపించే బాధ్యత తనదేనని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు. గర్రెపల్లి సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయించానని తెలిపారు. ఈసారి కూడా రైతులు భరోసాతో ఉండాలన్నారు. సన్న వడ్లకు బోనస్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రస్తుతం, బకాయి ఉన్న బోనస్‌ డబ్బులను రైతుల ఖాతాల్లో వేయిస్తామన్నారు. రైతుల సంక్షేమం పట్టని బీఆర్‌ఎస్‌, బీజేపీలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కటింగ్‌ లేకుండా జరుగుతాయన్నారు. ధాన్యం తూకం జరిగితే నిర్వాహకులు, మిల్లర్లతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. గర్రెపల్లిలోని సప్లయి గోదాంకు సంబంధించిన సమస్యను హమాలీలు ఎమ్మెల్యేకు వివరించగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పలువురు ఇందిరమ్మ లబ్ధిదారులు బిల్లులు రావడం లేదని ఆయన దృష్టి తీసుకుపోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ జూపల్లి సందీప్‌రావు, తిరుమలరావు, జానీ, అజయ్‌ గౌడ్‌, వెంకటేశం, దీకొండ శ్రీనివాస్‌, సత్యనారాయణరావు, చక్రధర్‌, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:22 PM