Share News

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:58 PM

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఈ సీజన్‌లో 28 వేల టన్నులకు గాను ఇప్పటి వరకు 19 వేల టన్నుల యూరియా సరఫరా చేశామని, ఇంకా 2500 టన్నుల యూరియా అందుబాటులో ఉంద న్నారు.

 యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు

పెద్దపల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఈ సీజన్‌లో 28 వేల టన్నులకు గాను ఇప్పటి వరకు 19 వేల టన్నుల యూరియా సరఫరా చేశామని, ఇంకా 2500 టన్నుల యూరియా అందుబాటులో ఉంద న్నారు. మంగళవారం వరకు 300 టన్నులు, 24వ తేదీ వరకుమరో 100 టన్నులు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి వస్తాయన్నారు. రైతు లు అవసరం మేరకు యూరియా కొను గోలు చేయాలన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా ఉండేందుకు జిల్లాలో చెక్‌ పోస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో 6,400 పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఇప్పటి వరకు 3926 లబ్ధిదారులు ఇళ్లకు ముగ్గు పోసుకున్నారని, 1466 వరకు బేస్మెంట్‌ వరకు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలి పారు. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల్ల బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని, ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో 19 కోట్ల 52 లక్షలు జమ అయ్యాయని తెలిపారు. పేదలకు స్వశక్తి మహిళా సంఘాల నుంచి 4 కోట్ల 9 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, మహిళా సంఘంలో సభ్యత్వం లేని 10 మం ది నిరుపేద కుటుంబాలకు కలెక్టరేట్‌ నుంచి లక్ష రూపాయలు చొప్పున రుణం కింద అం దించామన్నారు. నూతనంగా 12,165 కుటుం బాలకు రేషన్‌ కార్డులు జారీ చేశామని, మరో 30 వేల సభ్యులను కార్డుల్లో చేర్చామన్నారు. మీసేవ కేంద్రాలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలి స్తున్నామన్నారు. యువత అగ్నివీర్‌ కింద సైన్యంలో ఎంపికయ్యేందుకు ఆసక్తి గల 200 మంది అభ్యర్థులకు సింగరేణి, ఎన్టీపీసీ సహకారంతో ఉచితంగా శిక్షణ అందిస్తున్నా మన్నారు. న్యాక్‌ కేంద్రం ద్వారా వినోద రంగంలో మూడు నెలల శిక్షణ అందిస్తు న్నామని, దీనికి చెల్లించాల్సిన ఫీజులో జిల్లా యంత్రాంగం నుంచి కొంత సబ్సిడీ ఇస్తామ న్నారు. పెద్దపల్లి రీజినల్‌ టాస్క్‌ కేంద్రం ద్వారా కోర్సులు నేర్చుకున్న యువతకు మల్టీ నేషనల్‌ కంపెనీలలో 3 నుంచి 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తున్నాయని, డిగ్రీ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి పాసైన నిరు ద్యోగులు ముందుకు వచ్చి టాస్క్‌ కోర్సులలో రిజిస్టర్‌ కావాలన్నారు. ఐటిఐ, ఏటీసీ కేంద్రాలలో అవసరమైన ఆధునిక యంత్రాల ను అందుబాటులో పెట్టామన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తతతో అధికార యంత్రాంగం ఉందని, 4 కల్వర్టులు వరదల్లో మునగగా, 2 దెబ్బతిన్నాయని వీటి మరమ్మతుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎల్లం పల్లి నుంచి వస్తున్న వరదను నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 11:58 PM