యూరియా కోసం రైతుల పాట్లు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:16 AM
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూనారంలో సోమవారం యూరియా కొరతతో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట బారులు తీరారు. ప్రాథమిక సహకార సంఘానికి ఒక లోడు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో కాసేపు తోపులాట చోటు చేసుకుంది.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూనారంలో సోమవారం యూరియా కొరతతో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట బారులు తీరారు. ప్రాథమిక సహకార సంఘానికి ఒక లోడు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో కాసేపు తోపులాట చోటు చేసుకుంది. నాలుగు రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తు న్నామని, ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో అవి సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించా లని వారు డిమాండ్ చేస్తున్నారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులకు యూరియా గోస తప్పడం లేదు. సోమవారం మేడిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ఆధ్వర్యంలో కుక్కలగూడూర్‌లో ఎకరాకు ఒకటి చొప్పున 270 యూరి యా సంచులను అప్పగించారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో పుట్నూర్‌లో 270 సంచులు, కన్నాల ప్రాథమిక సహకార సంఘంలో 148 మంది రైతులు 367 యూరియా సంచులను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సమ యానికి యూరియా ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. రైతులకు సరిపడ యూరియా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అను గుణంగా యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు.