Share News

యూరియా కోసం రైతుల ఆందోళన

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:41 AM

మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూరియా కేంద్రం వద్ద రైతు లు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అందరికీ యూరియా బస్తాలు అందినట్లు వారు పేర్కొన్నారు.

యూరియా కోసం రైతుల ఆందోళన

కాల్వశ్రీరాంపూర్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూరియా కేంద్రం వద్ద రైతు లు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అందరికీ యూరియా బస్తాలు అందినట్లు వారు పేర్కొన్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సింగిల్‌ విండో ద్వారా రైతులకు సరిపడే యూరియాను అందుబాటులో ఉంచా మన్నారు. గతేడాది 520 మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులకు అందించగా, ప్రస్తుతం ఇప్పటి వరకు 620 మెట్రిక్‌ టన్నుల యూరియాను అందించినట్లు తెలిపారు.

మంథని : యూరియా స్టాక్‌ లేక పోవడాన్ని నిర సిస్తూ స్థానిక సింగిల్‌విండో కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పీఏసీఎస్‌ వద్దకు రాగా సిబ్బంది స్టాక్‌ లేదన్నారు. దీంతో అక్కడి చేరుకున్న సీపీఎం నేతలు రైతులతో కలిసి కార్యాల యం ఎదట ధర్నా చేశారు. రైతులకు సరిపడ యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. వ్యవ సాయాధికారులు స్టాక్‌ ఉందని చెప్పతున్నప్పటి క్షేత్ర స్థాయిలో దొరకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు బూడిద గణేష్‌, ఆర్ల సందీప్‌, గొర్రెంకల సురేష్‌లు ఉన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:41 AM