Share News

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:20 PM

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యత తీసుకొని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

ధర్మారం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యత తీసుకొని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నాయకులు, అధికారులు, రైతులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి కటిం గ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయా లని సూచించారు. కలెక్టర్‌తోపాటు సివిల్‌ సప్లయ్‌ అధికారులు కొనుగోలు కేంద్రాలను నిత్యం పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.

కొనుగోలు సమయంలో మిల్లర్లతో మాట్లాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి సెంటర్‌లో సన్న ధాన్యం కొనుగోలు జరగుతుందని, ప్రతీ రైతుకు సన్న వడ్ల బోనస్‌ అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని భరోసా ఇచ్చారు. ఏఎంసీ చైర్మెన్‌ లావుడ్య రూప్లానాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్య క్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, పత్తిపాక సింగల్‌ విండో చైర్మన్‌, నోముల వెంక ట్‌రెడ్డి, డైరెక్టర్లు గంధం మహి పాల్‌, బద్దం గంగారెడ్డి, కోల శ్రీనివాస్‌, సింగిల్‌ విండో డైరెక్టర్లు బద్దం రవీందర్‌ రెడ్డి, కొండ సులోచన, సీఈఓ బుచ్చయ్య, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 11:20 PM