ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు లాభాలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:37 PM
అయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వచ్చే అవకా శం ఉందని పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీని వాస్, కుడుదుల వెంకన్నలు వెల్లడించారు. అయిల్ పామ్ సాగుపై పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
మంథని, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వచ్చే అవకా శం ఉందని పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీని వాస్, కుడుదుల వెంకన్నలు వెల్లడించారు. అయిల్ పామ్ సాగుపై పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. అయిల్‌పామ్ 30 ఏళ్ళ వరకు రైతులకు ఆదాయాన్ని ఇస్తుందన్నారు. పంటల మార్పిడితో అనేక లాభాలు ఉంటాయన్నారు. టీజీఈఆర్‌సీ మెంబర్ శశిభూషణ్ కాచే మాట్లాడు తూ ఆయిల్‌పామ్ పంట సాగులో భూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చ న్నారు. అధికారులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): రైతులు పంట మార్పిడి చేయాలని మండల వ్యవసాయ అధికారి ఉమాపతి అన్నారు. శుక్రవారం బుర్హాన్‌మియాపేట్‌లోని గట్ల సంపత్‌రెడ్డి ఆరు ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటించారు. ఈ ప్రాంత రైతులు అధికంగా వరిపంట సాగుకు అలవాటు పడ్డారని, మోతాదుకు మించి పురుగు మందులు వాడటం వల్ల సారవంతమైన భూమి దెబ్బతింటుందని తెలిపారు. ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తుందన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించాల న్నారు. గణేష్, మహేష్, అభిలాష్ పాల్గొన్నారు.