కపాస్ కిసాన్ యాప్‌తో రైతులకు మేలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:52 PM
పత్తి కొనుగోళ్లలో అక్ర మాలకు చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయా ధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లలో అక్ర మాలకు చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయా ధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా పత్తి రైతులు యాప్‌లో నమోదు, తేమ శాతం ఎంత ఉండాలనే అంశంపై వీడియో కాన్పరెన్స్ నిర్వ హించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ పత్తి రైతులు తమ వివరాలతోపాటు సాగుకు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా ఉం టుందని, తేమ శాతం ఆధారంగా సీసీఐ ధర చెల్లిస్తుందన్నారు. ఏడిఏ శ్రీనాద్, మండల వ్యవసాయధికారిణి అలివేణి, ఏఈవోలు పాల్గొన్నారు.