బూడిద కమీషన్లు రావడం లేదనే తప్పుడు ఆరోపణలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:58 PM
బీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక హరి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు కందుల సతీష్, రాజ్‌కు మార్, హరినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎన్‌టీపీసీ యాష్ పాండ్ పరిసర ప్రాంతాలైన లక్ష్మీపురం, ఎల్కలపల్లి గేట్, గుంటూ రుపల్లి, ఎల్కలపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎఫ్‌సీఐలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కోల్‌సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక హరి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు కందుల సతీష్, రాజ్‌కు మార్, హరినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎన్‌టీపీసీ యాష్ పాండ్ పరిసర ప్రాంతాలైన లక్ష్మీపురం, ఎల్కలపల్లి గేట్, గుంటూ రుపల్లి, ఎల్కలపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎఫ్‌సీఐలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌పై కౌశిక హరి వ్యాఖ్యలను ఖండించారు. పార్టీలు మార్చే కౌశిక హరికి ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక లారీ ట్రిప్పు మీద నాయకులు వేలకు వేలు దండుకున్నారని, బూడిద కమీషన్లు వస్తే హరి మాట్లాడలేదని, ఇప్పుడు కమీషన్లు రావడం లేదనే అసత్య ఆరోపణలు చేస్తున్నాడ న్నారు. రాజ్‌ఠాకూర్ ఉచితంగా ఇటుక బట్టీలకు బూడిద సరఫరా చేయిస్తున్నాడని, దీన్ని తట్టుకోలేకే ఆరోపణలకు దిగుతున్నాడన్నారు. ఏనాడు ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతాల సమస్యలు పట్టించుకోని బీఆర్‌ఎస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. నాయకులు మానాల ప్రభాకర్, దబ్బెట మల్లేష్, శ్యామ్ గౌడ్, గుండు రాజయ్య, మేకల రాజ్‌కుమార్, పాల్గొన్నారు.