Share News

అభివృద్ధి చూడలేకనే అసత్య ఆరోపణలు

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:29 AM

రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు గట్ల రమేష్‌, పెద్దెల్లి ప్రకాష్‌ ఆరోపించారు.

అభివృద్ధి చూడలేకనే అసత్య ఆరోపణలు

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు గట్ల రమేష్‌, పెద్దెల్లి ప్రకాష్‌ ఆరోపించారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంలో రామగుండంలో గణనీ యమైన అభివృద్ధి జరిగిందని, ఇది చూడలేకనే ఎమ్మెల్యేపై కోరుకంటి చందర్‌ చార్జిషీట్‌ వేయడం హస్యాస్పదంగా ఉందని, అందులో తమకు సంబం ధించిన ఏ ఒక్క అంశం కూడా లేదని, గతంలో కూడా అతని చేయని పనులే ఉన్నాయన్నారు. రోడ్డు సైడ్‌ బిల్డింగ్‌లు కూల్చివేస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందని, గతంలో సోమారపు సత్యనారాయణ హయాం లో లక్ష్మీనగర్‌ వాణిజ్య, వ్యాపార కూడలిలో 40ఫీట్లకు మార్కింగ్‌ ఇచ్చిన విషయం చందర్‌కు తెలియక పోవడం శోచనీయమన్నారు. కొంత మంది రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందని, ఏ ఒక్క చిరు వ్యాపారికి అన్యాయం జరుగ లేదని, ఎవరికైనా నష్టం జరిగితే నిర్భయంగా రావ చ్చునన్నారు. క్వార్టర్లు కూల్చివేసిన స్థానంలో తిరిగి వ్యాపారులకు అప్పగించడం జరుగుతుందన్నారు. రెండు సంవత్సరాల కాలంలో రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అనేక నిధులను తీసుకువచ్చారని అన్నారు. రామగుండం సుందరీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, మెడికల్‌ హబ్‌గా, ఎడ్యుకేషన్‌ హబ్‌గా రామగుండాన్ని మార్చుతున్నారని, ఇది జీర్ణించుకోలేని ముగ్గురు బీఆర్‌ ఎస్‌ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. సమావేశంలో బొమ్మక రాజేష్‌, దాసరి విజయ్‌, ముస్తాఫా, నాయిని ఓదెలు, దూళికట్ట సతీష్‌, సింహాచలం, నజీమోద్దీన్‌, రవి, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:29 AM