కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:53 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించాలని అదనపు కలె క్టర్ డి.వేణు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో అదనపు కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్దపల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించాలని అదనపు కలె క్టర్ డి.వేణు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో అదనపు కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో వచ్చే ధాన్యం అంచనా ప్రకారం అవసరమైన తూకం యం త్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్, గన్ని సంచులు ఉండేలా చూడాలన్నారు.
వేయింగ్, తేమ యంత్రాల పని తీరు చెక్ చేసి సర్టిఫై చేయాలన్నారు. తాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కాంటాలను ఏర్పాటు చేయా లని, రవాణా చేసేటప్పుడు కూడా వేర్వేరు లారీలలో పంపాలన్నారు. సన్నరకం ధాన్యం కొనుగోలులో ఏమైన తేడాలు ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి, సెంటర్ ఇన్‌చార్జీలపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.