టోల్‌గేట్ వద్ద సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - May 19 , 2025 | 11:54 PM
కన్నాల టోల్ గేట్ వద్ద సర్వీస్ రోడ్లతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కా న్‌సింగ్ టోల్‌గేట్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, కన్నాల లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియే షన్ ఆధ్వర్యంలో టోల్‌ప్లాజా బూమ్ బారియర్లును ఎత్తి వేసి ఆందోళనకు దిగారు.
పాలకుర్తి, మే 19 (ఆంధ్రజ్యోతి): కన్నాల టోల్ గేట్ వద్ద సర్వీస్ రోడ్లతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కా న్‌సింగ్ టోల్‌గేట్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, కన్నాల లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియే షన్ ఆధ్వర్యంలో టోల్‌ప్లాజా బూమ్ బారియర్లును ఎత్తి వేసి ఆందోళనకు దిగారు. పుట్నూర్‌లో మండల వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీలుగు విత్త్త నాల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే టోల్ ప్లాజా వద్ద ఆగి అక్కడి పరిస్థితులపై మాట్లాడారు. ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలపై ,సర్వీస్ రోడ్ల నిర్వహణపై జరుగుతున్న నిర్లక్ష్యంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్‌గేట్ నిర్వా హకులు ప్రజలు, ప్రయాణికులపై చూపుతున్న నిర్ల క్ష్యంపై మండిపడ్డారు. 15 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా అధిక లాభాలు పొందుతున్న సంస్థ, ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ఉద్యోగులకు వేత నాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు లోడు తీసుకెళ్లి తిరిగి వస్తున్న లారీలకు టోల్ మాఫీ కల్పించాలని ఎమ్మెల్యే అభిప్రా యం వ్యక్తం చేశారు. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల లోపు వాహనాలను స్థానిక వాహ నాలుగా గుర్తించి ఉచితంగా రాకపోకలు కొన సాగించాలని సూచించారు. మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్, కన్నాల సహకార సంఘం చైర్మెన్ బయ్యపు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసి పాత భాగ్యలక్ష్మి రవిందర్ నాయకులు, కార్యకర్తలు, లారీ అసోసియేషన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి సీఐ కె ప్రవీణ్ కుమార్, బసంత్‌నగర్ ఎస్‌ఐ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.