బతుకమ్మ, దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:24 AM
బతుకమ్మ, దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీ ఎల్, ఎన్‌పీడీసీఎల్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీ ఎల్, ఎన్‌పీడీసీఎల్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఏర్పాట్లలో వివిధశాఖల పాత్ర గురించి వివ రించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ బతుకమ్మ, దసరా ఉత్సవాలకు సింగరేణి ఏర్పాట్లు చేయాలన్నారు. సద్దుల బతుకమ్మ రోజు కూడళ్లు, ఆలయాల వద్ద లైటిం గ్ ఏర్పాట్లు చేయాలని, దసరా ఉత్సవాలకు సంబం ధించి స్టేడియంలో అన్నీరకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు పరిశ్రమ ఉత్పత్తి జరుగడం లేదని, తాము ఈ ఏర్పాట్లలో పాల్గొనలేమని చెప్పగా ఎమ్మెల్యే ఇది సరైన విధానం కాదని, ఈ ప్రాంతంలో ప్రజలు, గ్రామాలు, ఊర్లనే పరిశ్రమ కోసం త్యాగం చేశారని పేర్కొన్నారు.
రోడ్లపై మండపాలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలలన్నారు. విద్యుత్‌శాఖ రోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు లేకుండా చూడాలని, ఆశాఖకు చెందిన నిధుల తోనే వాటిని మార్చాలన్నారు. రోడ్లను తవ్వుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారికి జరిమానా విధించాలని అధి కారులకు సూచిం చారు. ఏసీపీ రమేష్, సింగరేణి జీఎం లలిత్‌కు మార్, ఎస్‌ఎస్‌ఓ వీరారెడ్డి, డీజీఎం (సివిల్) వర ప్రసా ద్, ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనే జర్ శుక్ల, వంశీకృష్ణ, ఎన్‌పీడీసీఎల్ డీఈ ప్రభాకర్, ఏడీఈలు వెంకటేశ్వర్లు, రమేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి నరేష్, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్; ఈఈరామన్, డీసీ వెంకటస్వామి, ఏసీ వెంకటేశ్వర్లు, సెక్రటరీ ఉమామహేశ్వర్, ఫైర్ ఆఫీసర్ రాజేశం, ఎన్‌టీపీసీ అధికారులు సూర్యనారా యణ, కార్తీక్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్‌సీఐ రాజే శ్వర్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకు లు పాల్గొన్నారు.