గణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:09 AM
గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవరాత్రులు పూజలందుకున్న వినాయకులను శుక్రవారం గోదావరి నదిలో నిమజ్జనం చేయనున్నారు. రామగుండంతో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్, శ్రీరాంపూర్, జైపూర్ ప్రాంతాల గణపతులను కూడా ఇక్కడే నిమ జ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవరాత్రులు పూజలందుకున్న వినాయకులను శుక్రవారం గోదావరి నదిలో నిమజ్జనం చేయనున్నారు. రామగుండంతో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్, శ్రీరాంపూర్, జైపూర్ ప్రాంతాల గణపతులను కూడా ఇక్కడే నిమ జ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి, ఎన్‌పీడీసీఎల్, హెచ్‌కేఆర్, ఎన్‌టీపీసీ సహకారంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వంతెనకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేశారు. రామగుండం నగరపాలక సంస్థ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రామగుండం, ఎన్‌టీపీసీ, యైుటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని పట్టణం లోని వివిధ ప్రాంతాల్లో శోభాయాత్ర జరిగే రూట్లలో లైటింగ్ ఏర్పాట్లు చేసింది. మెయిన్ చౌరస్తాలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేస్తు న్నారు. గోదావరి వంతెన వద్ద 25 ప్లాట్‌ఫాంలు ఏర్పా టు చేసి అక్కడి నుంచే నదిలో గణనాథులను నిమజ్జ నం చేసేలా చర్యలు చేపడుతున్నారు. సింగరేణి సంస్థ ప్లాట్‌ఫాంలను, క్రేన్‌లను సమకూర్చుతోంది. ఎన్‌పీడీసీ ఎల్ గోదావరి రెండు వంతెనలు, పుష్కర ఘాట్ ప్రాం తాల్లో లైటింగ్ అవసరాలకు ప్రత్యేకంగా అదనపు ట్రాన్స్ ఫార్మర్లను బిగించింది. ఫిషరీస్ విభాగం ఆధ్వర్యంలో స్పీడ్ బోట్‌ను, 25మంది గజ ఈతగాళ్లను అందుబా టులో ఉంచారు. గోదావరినది నిండుకుండలా ప్రవహి స్తుండడంతో సమ్మక్క - సారలమ్మ పుష్కర ఘాట్‌వైపు దారిని మూసివేశారు.
నిఘా నీడలో నిమజ్జనం... భారీ బందోబస్తు...
గోదావరిఖని గోదావరి వంతెన వద్ద శుక్ర, శనివా రాల్లో రెండు రోజుల పాటు రామగుండం, మంచిర్యాల జిల్లాల్లోని కోల్‌బెల్ట్ ప్రాంతాల నుంచి గణనాథులను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్రను డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిం చనున్నారు. గోదావరి వంతెన వద్ద 25సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. జైపూర్, గోదావరిఖని, ఏసీపీలు, ట్రాఫిక్ ఏసీపీ, కోల్‌బెల్ట్ సీఐలు, ఆర్‌ఐలు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెద్దపల్లి జోన్ పరిధిలో ముగ్గురు ఏసీపీలు, 8మంది సీఐలు, 24మంది ఎస్‌ఐలు, 180మంది కానిస్టేబుళ్లు, 32మంది హోంగార్డులు, ఏఆర్ స్పెషల్ పార్టీకి చెందిన 32మంది, ఎస్‌అండ్‌పీసీ నుంచి 100మందితో పాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ కెడెట్లు సేవలందించనున్నారు.
పరిశీలించిన ఎమ్మెల్యే, సీపీ
గోదావరి వంతెన వద్ద నిమజ్జన ఏర్పాట్లను గురు వారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీలు రమేష్, వెంకటేశ్వర్ పరి శీలించారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నం దున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిం చారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. రోడ్డు సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, తాగునీరు, వైద్య సౌకర్యాలు, అగ్నిమాపక చర్యలు, శానిటేషన్, తదితర చర్యల గురించి చర్చించారు.