దేశ ఐక్యతకు ప్రతీ ఒక్కరు పాటుపడాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:08 AM
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలె క్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, అరుణ శ్రీలతో కలిసి సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి నివాళు లర్పించారు.
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలె క్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, అరుణ శ్రీలతో కలిసి సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి నివాళు లర్పించారు. దేశ ప్రథమ హోం మంత్రిగా వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించుకొంటున్నామన్నారు. దేశ ప్రజల్లో మనమంతా భారతీయుల మనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడని కొనియాడారు. అనం తరం దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి అంకితమవుదామని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఐటీఐ ప్రాంగణం నుంచి చౌరస్తా వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌లో యూనిటి ఫర్ రన్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్డీఓ గంగయ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోల్‌సిటీటౌన్,(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నాగమల్ల రాజేందర్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. దేశంలోని అనేక సంస్థానాలను విలీనం చేసి చరిత్రలో నిలిచారన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ పీవో శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెక్రెడ్ హార్ట్ హైస్కూల్‌లో జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఆరోగ్యమేరి మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్‌సీసీ ఫస్ట్ ఆఫీసర్ జ్యోత్న్స, ఎన్‌సీసీ కెడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరామ విద్యానికేతన్ పాఠశాలలో కార్యక్రమం నిర్వహిం చారు. ప్రధానోధ్యాయురాలు జ్యోతి, ఎన్‌వైపీ రాష్ట్ర అధ్యక్షుడు యాదవ రాజు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. పీజీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఇనుగాల మనోహర్ హాజరై మాట్లాడారు. అధ్యాప కులు డాక్టర్ రవి, సుధా, అంబిక, రఘుపతి, అనిల్‌కుమార్, రమ్యశ్రీ, రవీందర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వై.ప్రసాద్ పాల్గొన్నారు. మార్కండేయకాలనీలోని స్నేహసాహితీ గ్రంథాలయంలో ఎన్‌వైపీ ఆధ్వ ర్యంలో పటేల్ జయంతి నిర్వహించారు. కవి రచయిత ఏలేశ్వరం వెంకటేశ్, ఎన్‌వైపీ రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, సామాజిక కార్యకర్తలు కనుకుంట్ల రమేష్, రవి పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): దేశ సమగ్రతకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటే ల్ జయంతి పురస్కరించుకొని 2కెరన్ నిర్వహించారు. యువకులతో కలిసి పోలీసులు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు.
పాలకుర్తి,(ఆంధ్రజ్యోతి): జాతీయ ఐక్యత దినోత్సవం, రన్ ఫర్ యూని టీలో భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎస్‌ఐ నూతి శ్రీధర్ అన్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటి నిర్వహించారు. జాతీయ ఐక్యతా ప్రతిజ్ఙ చేశారు. పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మహనీయులు చూపిన మార్గంలో యువత పయనించి వారి తల్లిదండ్రుల ఆశయాలకు ఊపిరి పోయాలని ఎస్‌ఐ మదుకర్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. పో లీస్‌స్టేషన్ సిబ్బందితోపాటు మండలానికి చెందిన యువత పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి, యువకులు కప్పల ప్రవీణ్, పలు గ్రామాల యువకులు, పోలీసులు పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి) సర్దార్ వల్లాబాయ్ పటేల్ వర్ధంతి పురస్కరిం చుకుని ఎస్‌ఐ సనత్‌కుమార్ ఆధ్వర్యంలో 2కే రన్‌ను నిర్వహించారు. రన్‌లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): సర్దార్ వల్లభాయ్ స్ఫూర్తితో అందరం ఏకంగా ఉండాలని ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏక్తా దినోత్సంలో భాగంగా 2కె రన్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేశం, సభ్యులు తలమక్కి రవీందర్ శెట్టి, యోగా గురు సుధాకర్, బీజేపి మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగయ్య పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. ఇంచార్జి ప్రిన్సిపాల్ జీఎల్‌ఎన్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం నైజాం నవాబు నుంచి విలీనం చేయడంలో వల్లభాయ్ పాత్ర మరువలేదన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ పీఓ రాజేశం, డీఆర్ శివదాస్, పూర్ణచందర్, వెంకటకృష్ణరెడ్డి, లింగమూర్తి, రుక్మ, జెరూష, శ్రీనివాస్, జయ, పాల్గొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో 2 కే రన్ నిర్వహించారు. ఎస్‌ఐ రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించగా యువత ఉత్సాహాంగా పాల్గొన్నారు.