Share News

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:35 PM

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలనికలెక్టర్‌ కోయ శ్రీ హర్ష పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్ట రేట్‌ సమావేశ మందిరంలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 5వ వార్షికోత్సవం సంద ర్భంగా కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ డి వేణు, డీసీపీ కరుణాకర్‌లతో కలిసి అధి కారులు, కలెక్టరేట్‌ సిబ్బందిచే మాదకద్ర వ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు.

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 18 (ఆంఽధ్రజ్యోతి): డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలనికలెక్టర్‌ కోయ శ్రీ హర్ష పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్ట రేట్‌ సమావేశ మందిరంలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 5వ వార్షికోత్సవం సంద ర్భంగా కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ డి వేణు, డీసీపీ కరుణాకర్‌లతో కలిసి అధి కారులు, కలెక్టరేట్‌ సిబ్బందిచే మాదకద్ర వ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, డ్రగ్స్‌ రహిత జీవన శైలి అనుస రిస్తూ, మన చుట్టూ ఉన్న ఎవరు డ్రగ్స్‌ బారిన పడకుండా కృషి చేయాలని కలెక్టర్‌ తెలి పారు. యువత జీవితాలను డ్రగ్స్‌ మహ మ్మారి నాశనం చేస్తుందని కలెక్టర్‌ సూచిం చారు. డ్రగ్స్‌ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా అధికారు లకు తెలుపా లన్నారు. టైన్రీ డిప్యూటీ కలెక్టర్‌ బి .వనజ, ఏసిపి గజి కృష్ణ, అధికా రులు పాల్గొన్నారు

కోల్‌సిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మాదకద్ర వ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలా పాలను అరికట్టే దిశగా ప్రభుత్వం చేపడుతున్న నషా ముక్త్‌ భారత్‌లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. ప్రస్తుత సమా జాన్ని, యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం కోసం ప్రజల సహకారం అవసరమని తెలి పారు. కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీసు అధికా రులు, సిబ్బంది, సీపీఓ సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుం దని, కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని సీపీ పేర్కొ న్నారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేం ద్రగౌడ్‌, ఏఓ శ్రీనివాస్‌, వివిధ వింగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు రాజేం ద్రప్రసాద్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, బాబురావు, నార్కోటిక్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌ కుమార్‌, ఆర్‌ఐలు శ్రీనివాస్‌ వామనమూర్తి పాల్గొన్నారు.

పెద్దపల్లి కల్చరల్‌, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదు వులో రాణించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని అద నపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నషా ముక్త్‌ భారత్‌ ఐదవ వార్షికో త్సవ వేడుకల్లో మాట్లాడారు. 4జీ, 5జీ టెక్నాలజీ పరుగు పెడుతున్న తరుణంలో దాన్ని అందించిపుచ్చుకొని మరింత ముందుకు సాగాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో జీవితం అలవర్చు కొని తల్లితండ్రులకు గురువులకు సమాజానికి పేరు తెచ్చేలా వ్యవహరించాలన్నారు. అనంతరం విద్యార్థుల తో ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ కలెక్టర్‌ వనజ, ఆర్డీఓ గంగయ్య, ఎంఈఓ సురేందర్‌, సీడీపీఓ కవిత, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రవీందర్‌రెడ్డి, సూపరిం టెండెంట్‌ రాజయ్య, ఎఫ్‌ఆర్‌ఓ స్వర్ణలత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్‌ శ్యామల, పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:35 PM