దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:14 AM
దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల్లో జాతి ఐక్యత, సామరస్యం, దేశ భక్తి, సమైక్యత భావంపై అవగాహన కల్పించడానికే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శుక్రవారం సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు(రన్ ఫర్ యూనిటీ)ను నిర్వహించారు.
కోల్‌సిటీ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల్లో జాతి ఐక్యత, సామరస్యం, దేశ భక్తి, సమైక్యత భావంపై అవగాహన కల్పించడానికే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శుక్రవారం సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు(రన్ ఫర్ యూనిటీ)ను నిర్వహించారు. కమిషనరేట్ ఎదుట జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుంచి మున్సిపల్ టీ జంక్షన్ వరకు, తిరిగి కమిషనరేట్ వరకు కొనసాగింది. సీపీతో పాటు సిటీనటుడు సాగర్ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలు, ఆయన నాయకత్వ పటిమ, దేశాన్ని ఐక్యత దిశగా నడిపించిన ఆయన స్ఫూర్తి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, మల్లేషం, సంపత్, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.