Share News

స్వచ్ఛత హీ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:42 PM

రామగుండం కార్పొరేషన్‌లో అక్టోబరు 2వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కమిషనర్‌ అరుణ శ్రీ పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేషన్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

స్వచ్ఛత హీ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి

కోల్‌సిటీ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో అక్టోబరు 2వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కమిషనర్‌ అరుణ శ్రీ పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేషన్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రెండు వారాల పాటు స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. అనంతరం చౌరస్తాలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. డీసీ వెంకటస్వామి, ఏసీ వెంకటేశ్వర్లు, సెక్రటరీ ఉమా మహేశ్వరావు, ఈఈ రామన్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాజు, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, ఆర్‌ఐ శంకర్‌రావు పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధించాలని కమిషనర్‌ అరుణశ్రీ వార్డు ఆఫీసర్లకు సూచించారు. రెవెన్యూశాఖకు బదిలీ అయిన వార్డు ఆఫీసర్ల స్థానంలో ఇతర సిబ్బందిని నియమించారు. పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా జరగాలన్నారు. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ట్రేడ్‌ లైసెన్స్‌లు వసూలు చేయాలన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఆర్‌ఐలు శంకర్‌రావు, ఖాజా, వార్డు అధికారులు పాల్గొన్నారు.

రామగిరి (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌లలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వర్‌రావులు ప్రారంభించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు అక్టోబరు2 వరకు సింగరేణి వ్యాప్తంగా కొనసాగిస్తామని జీఎంలు ప్రతిజ్ఞ చేశారు. సంతోష్‌, కొటరవీందర్‌రెడ్డి, యాదయ్య, రామ్మోహన్‌, రాజారెడ్డి, సుదర్శనం, జనార్థన్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌, సురేఖ, ఐలయ్య, షబ్బిరుద్దీన్‌ పాల్గొన్నారు.

యైటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): బొగ్గు మంత్ర్విశాఖ ఆదేశాల మేర కు ఆర్జీ-2 ఏరియాలో స్వచ్ఛతాహీసేవా కార్యక్రమాలు ప్రారంభమ య్యాయి. జీఎం ఆఫీస్‌లో ఏరియా అఫీషియేటింగ్‌ జీఎం ఎం రాముడు ఉద్యోగులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ సురేష్‌బాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ సంతోష్‌కుమార్‌, ఏఐటీయూసీ పిట్‌ సెక్రెటరీ మహేందర్‌, డీజీఎం పర్సనల్‌ అరవిందరావు, పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:42 PM