Share News

శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయండి

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:44 PM

వంద రోజుల కార్యాచరణ ప్రణా ళికలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు వెంటనే ఖాళీ చేయాలని, పరిసరాలలో ఎవరూ సంచరించ రాదని నోటీసులు అంటించారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయండి

కోల్‌సిటీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): వంద రోజుల కార్యాచరణ ప్రణా ళికలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు వెంటనే ఖాళీ చేయాలని, పరిసరాలలో ఎవరూ సంచరించ రాదని నోటీసులు అంటించారు. శివారు ప్రాంతాల్లో నల్లా నీటికి క్లోరిన్‌ పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి గాంధీనగర్‌లోని కమ్యూనిటీ టాయిలెట్స్‌లో వసతులు పరిశీలించారు. ఆవరణ అంతా పరిశుభ్రం చేయించారు. చైతన్యపురి కాలనీలో ముళ్ళ పొదలు తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై, తడి, పొడి చెత్త వేరు చేయడం, దోమల నిర్మూలన, కుక్క కాటు బారిన పడకుండా తీసుకో వలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే కళాజాతా నిర్వహించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, నాగభూషణం, కిరణ్‌, మెప్మా సీఓ ప్రియదర్శిని, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ మధుకర్‌, ఎంఐఎస్‌ ఆపరేటర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:44 PM