రైతులు మోసపోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:49 PM
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని మార్కెట్ చైర్మన్ వైనాల రాజు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీఎంఓ ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
కమాన్‌పూర్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని మార్కెట్ చైర్మన్ వైనాల రాజు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీఎంఓ ప్రవీణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం గొల్లపల్లి లోని పరమేశ్వర కాటన్ పరిశ్రమలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభు త్వం 8 శాతం తేమతో రూ.8110 మద్దతు ధరనుప్రకటించిందన్నారు.
కాపాస్ యాప్‌లో ముందుగా బుకిం గ్ చేసుకోవాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు ప్రభుత్వం కల్పించే మద్దతు ధరకు పత్తి పంటను అమ్ముకునే వెసలు బాటు ఉంటుందన్నారు. కౌలు రైతు లు మండల వ్యవసాయ అధికారి నుండి ధ్రువీక రణ పత్రం పొందాలని తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్‌రావు, మాజీ ఎంపీపీలు రాంచంద్రం గౌడ్, తోట చంద్రయ్య, మాజీ సర్పంచ్‌లు రవీందర్, ఆకుల ఓదెలు, శిలారపు అనిత మల్లయ్య, పాల్గొన్నారు.