Share News

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:21 AM

పర్యావరణ సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీ హర్షతో కలిసి శుక్రవారం ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాల పచ్చదనం పెంచే దిశగా కృషి చేయాలని, ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి  బాధ్యత

పెద్దపల్లి టౌన్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి) పర్యావరణ సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీ హర్షతో కలిసి శుక్రవారం ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాల పచ్చదనం పెంచే దిశగా కృషి చేయాలని, ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవంలో ప్రజలు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పట్టణంలో బ్లాక్‌ ప్లాంటేషన్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ లో ఎత్తైన మొక్కలు నాటాలని, వాటికి ట్రీ గార్డ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలను కాపాడటం బాధ్యతగా ప్రజలు ముందుకు రావాలని, అప్పుడే గ్రీనరీ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం నాటుతున్న 550 మొక్కలు ఎదిగేలా చూడాలన్నారు. ఐటీఐలో వాకర్స్‌ కోసం లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ను కోరారు. 10 లక్షల రూపాయలతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వివరించారు. వ్యవసాయ కమిటీ చైర్‌ పర్సన్‌ స్వరూప, సుల్తానాబాద్‌ వ్యవసాయ కమిటీ చైర్మన్‌ ప్రకాష్‌ రావు, జిల్లా అటవీ అధికారి శివయ్య, ఆర్టీవో రంగారావు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, తహసిల్దార్‌ రాజయ్య, పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:21 AM