Share News

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - May 28 , 2025 | 11:53 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరు బాధ్యతగా గుర్తించా లని కేంద్ర పర్యావరణ డైరెక్టర్‌ తరుణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌లలో ఆయన పర్యటించారు. జూన్‌ 5 వరకు నిర్వహిస్తున్న వక్షోత్సవాల అవ గాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

రామగిరి, మే 28 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరు బాధ్యతగా గుర్తించా లని కేంద్ర పర్యావరణ డైరెక్టర్‌ తరుణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌లలో ఆయన పర్యటించారు. జూన్‌ 5 వరకు నిర్వహిస్తున్న వక్షోత్సవాల అవ గాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లా డారు. ప్లాస్టీక్‌ వాడకం తగ్గించుకొని పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రిం చాలని కోరారు. జీఎం కార్యాలయం లో మొక్కలు నాటి పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. జ్యూట్‌ బ్యాగ్స్‌ అందజే శారు.

జూలపల్లి, నాగేపల్లి, పన్నూరు, రత్నాపూర్‌ గ్రామాల చెక్‌ డ్యామ్స్‌, ఇం కుడు గుంతలు, బస్‌షెల్టర్లు, ప్లాంటేషన్‌ పను లను పరిశీలించారు. ఏపిఏ జీఎం నాగేశ్వ ర్‌రావు, కార్పోరేట్‌ ఎన్విరాల్‌మెంట్‌ జీఎం సైదు లు, అదికారులు రామ్మోహన్‌, శేఖర్‌బాబు, శ్రీని వాసులు, రాజశేఖర్‌, రాజారెడ్డి, కిషన్‌, రాజేంద్ర కుమార్‌, సుదర్శనం, కళ్యాణ్‌, పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:10 PM