ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధిహామీ అనుసంధానం
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:46 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుని కుటుంబాన్ని భాగస్వాములుగా చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం అనుసంధానం చేసింది.
మంథనిరూరల్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందు కోసం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుని కుటుంబాన్ని భాగస్వాములుగా చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం అనుసంధానం చేసింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారుని కుటుంబానికి జాబు కార్డు కల్గి ఉంటే 90 రోజుల పనిదినాలు కల్పించేలా చర్యలు చేపడుతుంది. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణలకు కూలీల కొరత లేకుండా లబ్ధిదారుని కుటుంబం పని చేసుకుని కూలీ పొందడంతో పాటు ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదట ఎంపిక చేసిన గ్రామాలలో చేపట్టగా అదే గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేస్తున్నారు. మంథని మండలంలో అడవిసోమన్‌పల్లి గ్రామాన్ని పైలట్ గ్రామపంచాయతీని ఎంపిక చేశారు. గ్రామాంలో 228 ఇండ్లను మంజురు చేశారు. ఇందులో ఉపాధిహామీ పథకంలో జాబు కార్డు ఉన్న లబ్ధిదారులను 74 మందిని అధికారులు గుర్తించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టి జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారుడు బేస్‌మెంట్ స్థాయి వరకు 40 రోజుల పని దినాలు, స్లాబ్ వరకు 50 రోజుల పనిదినాలు కల్పించానున్నారు. 90 రోజుల పని దినాలు చేసిన లబ్ధిదారునికి 28 వేల 630 కూలీ చెల్లిస్తారు.ఇందు కోసం అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా జరిగి పూర్తి కానున్నాయి.
జాబు కార్డు ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం
ఏపీవో సదానందం
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి పైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసిన అడవిసోమన్‌పల్లి గ్రామంలో 74 ఇండ్లను మొదటగా గుర్తించి ప్రతిపాదనలు ఏర్పాటు చేశాం. ఉపాధిహామీ పథకం జాబు కార్డు కల్గిన లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. లబ్ధిదారుల కుటుంబం పని చేసుకుంటు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు.