రెవెన్యూ సదస్సుల పైలట్ ప్రాజెక్ట్‌గా ఎలిగేడు
ABN , Publish Date - May 03 , 2025 | 11:48 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు కింద ఎలిగేడు మండలంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఈనెల 5 నుంచి 19 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వ హణపై సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు కింద ఎలిగేడు మండలంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఈనెల 5 నుంచి 19 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వ హణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎలిగేడు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించిందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక అధి కారిగా పర్యవేక్షిస్తారని తెలిపారు. జిల్లాలో 3 బృందాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీలో 2 రోజులపాటు రెవెన్యూ సదస్సు జరిగేలా షెడ్యూల్ రూపొందించామన్నారు.
ఎలిగేడు తహసీల్దార్ ఎండీ బషీరుద్దీన్ ఆధ్వర్యంలోని బృందం 5, 6 తేదీల్లో ఎలిగేడులో, 7, 8 తేదీల్లో లాలపల్లిలో, 9, 12 నారాయణపల్లిలో, 13, 14 తేదీల్లో శివపల్లిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ యాకన్న ఆధ్వర్యంలో బుర్హాన్‌మియాపేట, నర్సాపూర్, సుల్తాన్‌పూర్, లోకపేటలో, కలెక్టరేట్ నాయబ్ తహసీల్దార్ ధీరజ్‌కుమార్ ఆధ్వర్యంలో ధూళికట్టలో, ర్యాకల్‌దేవ్‌పల్లి, రాములపల్లి, 17, 19 తేదీల్లో ముప్పిరితోటలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంపై సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తామని, భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఆర్‌డీఓ బి గంగయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎలిగేడు తహసీల్దార్ బషీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.