Share News

విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:16 AM

విద్యుత్‌ సమస్యల పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకురావా లని ఫోరం చైర్‌పర్సన్‌ రాజగోపాలచారి అన్నారు. కాట్నపల్లి సబ్‌స్టేషన్‌ ఆవరణలో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు.

విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సుల్తానాబాద్‌ , ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సమస్యల పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకురావా లని ఫోరం చైర్‌పర్సన్‌ రాజగోపాలచారి అన్నారు. కాట్నపల్లి సబ్‌స్టేషన్‌ ఆవరణలో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ పంపిణీలో ఎదురయ్యే సేవాలోపాలను సత్వరమే పరిష్కరించి వినియోగదారుల సమస్యల పరిష్కారానికి వేదికను ఏర్పాటు చేశామన్నారు.

కొదురుపాక గ్రామస్థుడు మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు, ఇండ్ల కనెక్షన్లకు కలిపి ఒకటే ట్రాన్స్‌ఫార్మర్‌ ఉందని, దాంతో మోటార్లు నడిచే సమయంలో ఇండ్లలో సరఫరాపై భారం పడి లోఓల్టేజీతో బల్బులు డిమ్‌గా వెలుగుతున్నాయని పేర్కొ న్నారు. పదేళ్ళుగా లోఓల్టేజీ సమస్యతో సతమతమవుతున్నామని, అధికారులకు సమస్య చెబుతున్నా పరిష్కారం కావడం లేదని సుల్తానాబాద్‌ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. భూపతిపూర్‌ చెందిన ఓ మహిళలకు ఇంటి మీటర్‌ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం గురించి ప్రస్తావించారు. అలాగే ఐతరాజుపల్లి, కాట్న పల్లి గ్రామానికి చెందిన పలువురు సమస్యలు ప్రస్తావించగా స్పందించిన చైర్‌పర్సన్‌ వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓవర్‌ లోడ్‌ సమస్యకు ప్రాధాన్యంఇవ్వాలని, సమస్యలు లేకుండా చూడాలని, సర్వీసులను క్రమబద్దీకరిం చాలని, అవసరమైన చోట స్తంభాలు వేసి కొత్త మీటర్లు ఇవ్వాలన్నారు. ఫోరం మెంబర్లు రమేష్‌, చరణ్‌దాస్‌, రామారావు, జిల్లా ఎస్‌ఈ మాధవరావు, పెద్దపల్లి డీఈ తిరుపతి, ఏడీఈతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

కాట్నపల్లిలో నిర్వహించే విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక గురించి తమకు సమాచారం ఇవ్వలేదని పలు గ్రామాలకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Feb 12 , 2025 | 12:16 AM