ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:54 PM
పంచాయతీ ఎన్నికలు పారదర్శ కంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్‌లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు పారదర్శ కంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్‌లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నిక మొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు భావించి అధికారులు పని చేయాలన్నారు. ఎంసిసి అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగిం చేలా చూడాలన్నారు. ప్రచార ఖర్చు వివరాలు కట్టుదిట్టంగా అభ్యర్థి ఖాతా లో నమోదు చేయాలని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు వేర్వేరు ఉన్న చోట బ్యాలెట్ తరలింపు అప్రమత్తంగా చేయాలన్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు వైన్‌షాప్స్ మూసి వేయాలని, పంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించాలని, ఎక్కడ చిన్న పొరపాటు కావడానికి ఆస్కా రం లేదని, ఫ్రీఅండ్‌ఫేయిర్‌గా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా నిఘా పెట్టాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కావద్దని, అభ్యర్థుల ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేయాలని, చిన్న ఫిర్యాదును కూడా నిర్లక్ష్యం చేయవద్దన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలు చేస్తున్నామని, ఎన్నికల ప్రచార ఖర్చులను నమోదు చేసేందుకు ధరల లిస్టు సిద్ధం చేశామని అన్నారు. కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, 24 గంటలు పని చేసేలా మూడు షిఫ్టులలో సిబ్బంది నియమించామన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ర్యాలీలు, సభల నిర్వహణకు తహసీల్దార్, పోలీస్ అధికారులు అనుమతి అందిం చేలా వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల సిబ్బంది కేటాయింపు పోలింగ్ కేంద్రాల వారీగా 3వ ర్యాండమైజేషన్ సాధారణ పరిశీలకుల ఆధ్వర్యంలో చేపట్టాలన్నారు. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రశాం తంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రౌడీ షీటర్లు, గత ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిని బైండోవర్ చేయాలని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని, బెల్ట్ షాపులను మూసి వేస్తున్నామన్నారు. ఆర్డీఓలు బి.గంగయ్య, సురేష్, డీసీపీ. రామ్ రెడ్డి ,ఏసిపి రమేష్, జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పాల్గొన్నారు.