నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:01 AM
పంచాయతీ ఎన్ని కలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పాల్గొ న్నారు.
పెద్దపల్లి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్ని కలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పాల్గొ న్నారు. కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పం చ్ నియామకం జరిగేలా చూడాలన్నారు. ఏకగ్రీవంగా ఎంపికైన సర్పంచ్‌కు ఫారం 10 ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామాలలో స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున సంబంధిత రిపోర్టులు టీపోల్‌లో నమోదు చేయాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతి దర ఖాస్తు పరిశీలించి బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పా టు చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ నిబంధనల ప్రకారం ముద్రించాలని అన్నారు. ప్రచారంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భం గా నిర్వహించే తనిఖీలలో అక్రమంగా నగదు, మద్యం, ఆభరణాలను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలించే పక్షంలో సీజ్ చేయాలన్నారు. పోలింగ్ రోజు సరిహద్దు ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సీజన్ నడుస్తున్నందున రైతుల వద్ద నుంచి ఆధారాలు పరిశీలించాలని, పంట డబ్బులకు ఆధారాలు ఉంటే సీజ్ చేయవద్దన్నారు. జడ్పీ సిఈఓ నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.