ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:46 PM
జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలను పక డ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికా రులకు సిబ్బందికి సూచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు.
సుల్తానాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలను పక డ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికా రులకు సిబ్బందికి సూచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రం లోని అన్ని కౌంటర్లను సందర్శించి పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే వారికి అప్పగిస్తున్న పనులను ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించాలని, ప్రతీ రెండు గంటలకు ఒకసారి రిపోర్టు పంపాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కౌం టింగ్ ప్రారంభించాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అదే రోజు జరిగేలా చూడాలన్నారు. మూడో విడత ఎన్నికల సందర్భంగా 67 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వీటిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు ఎన్నికల విధుల ను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. అద నపు కలెక్టర్ వేణు, జడ్పీ సీఈఓ నరేందర్, తహసిల్దార్ బషీరొద్దిన్,ఎంపీడీఓ దివ్యదర్శ న్ రావు తదితరలు ఉన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): ఎలిగేడు మం డల ప్రజాపరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. బుధవారం జరగనున్న తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పని చేసే అధికారుల వివరాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ యాకయ్య, ఎంపీడీఓ భాస్కర్ రావు, ఎంఈఓ నరేంద్రచారి, ఏఓ ఉమాపతి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం గండ్ర దేవెందర్ రావు, డిప్యూటీ తహసిల్దార్ సిరిపురం గిరి, తదితర సిబ్బంది ఉన్నారు.
పెద్దపల్లి రూరల్/ఓదెల, (ఆంధ్రజ్యోతి): మూడవ విడత పంచాయతీ ఎన్నికల నిర్వ హణకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిధిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు తమ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించారు. ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, తహసీల్దార్ రాజయ్య, సీడీపీవో కవిత, ఏవో అలివేణి తో పాటు పలువురు పాల్గొన్నారు. ఓదెల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పా టు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ ధీరజ్ కుమార్, డీసీపీ రామ్‌రెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ, గోదావరిఖని ఏసీపీ రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.