Share News

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:42 PM

ఎన్నికల విధులను రిటర్నింగ్‌ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికల పరిశీల కులు అనుగు నరసింహారెడ్డితో కలిసి ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులతో సమా వేశం నిర్వహించారు.

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

పెద్దపల్లి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధులను రిటర్నింగ్‌ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికల పరిశీల కులు అనుగు నరసింహారెడ్డితో కలిసి ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులతో సమా వేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మంగళవారం రెండో విడత ఎన్ని కల సిబ్బందికి, 11న మూడో విడత సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటిం గ్‌ సౌకర్యం కల్పించాలని, రిటర్నింగ్‌ అధికారులు ఎంపీడీఓ కార్యాల యం వద్ద అందుబాటులో ఉండాలని తెలిపారు. మొదటి విడత పోస్టల్‌ బ్యాలెట్‌ సుమారు 68 వరకు వచ్చాయని తెలిపారు. డిస్ట్రిబ్యూ షన్‌ కేంద్రాలకు పోలింగ్‌ బృందాలు చేరుకున్నాయో లేదో రిటర్నింగ్‌ అధికారి ఫాలో అప్‌ చేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని ముందు పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలిం గ్‌కు ముందురోజు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్దే స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసి కౌంటింగ్‌కు చర్యలు చేపట్టాలని అన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతుం దని, కౌంటింగ్‌ జాగ్రత్తగా చేయాలన్నారు.

పంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే ఉప సర్పంచ్‌ ప్రక్రియ ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని, 50 శాతం కంటే ఎక్కువ వార్డు సభ్యులు అందుబాటులో ఉండేలా వారికి సమాచారం అందించాలని అన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌, ఉప సర్పంచ్‌ ఎంపిక పూర్తయి, ఎంపీ డీవో కార్యాలయంలో పోలింగ్‌ సామగ్రి డిపాజిట్‌ చేసే వరకు రిట ర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బంది పూర్తి బాధ్యతగా ఉండాలని కలెక్టర్‌ అన్నారు. జడ్పీ సీఈవో నరేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి శారద, పాల్గొన్నారు.

పాలకుర్తి, అంతర్గాంలో పర్యటన

పాలకుర్తి, అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): పాలకుర్తి మండలంలోని రిక్రియేషన్‌ క్లబ్‌, అంతర్గాం మండలంలోని ఎంపిడీవో కార్యాలయాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 9న పోలింగ్‌ సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకునే సమ యంలో ఫారం 14, ఎలక్షన్‌ డ్యూటీ ఆర్డర్‌ ప్రతులు తీసుకురావాలని, రెండో విడత పోలింగ్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకో వాలని కలెక్టర్‌ తెలిపారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పంపిణీ నిబం ధన ప్రకారం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపిడివోలు పొల్సాని శశికళ, వేముల సుమలత, ఎంపివోలు పూర్ణచందర్‌ రావు, కర్ణాకర్‌, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 11:42 PM