Share News

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:04 AM

పంచాయతీ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం మొదటి విడత పోలింగ్‌ జరిగే కాల్వశ్రీ రాంపూర్‌ కమాన్‌పూర్‌, మం థని, రామగిరి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాలన్ని తనిఖీ చేశారు.

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

కాల్వశ్రీరాంపూర్‌/కమాన్‌పూర్‌/ మంథని/ రామగిరి/ ముత్తారం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం మొదటి విడత పోలింగ్‌ జరిగే కాల్వశ్రీ రాంపూర్‌ కమాన్‌పూర్‌, మం థని, రామగిరి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాలన్ని తనిఖీ చేశారు. మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు సంబం ధించి ఈ నెల 6న పోలింగ్‌ సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సజావుగా సాగేలా చూడాలన్నారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పంపిణీ నిబంధనల మేరకు సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తె లిపారు. అలాగే డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లు, రిసెప్షన్‌ సెంటర్ల వద్ద ఏర్పాట్లపై కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సజావుగా సాగేలా చూడాలన్నారు.

అనంతరం మంథని పట్టణ శివారులో నిర్మించే శ్రీపాద మార్గ్‌ ఫోర్‌లేన్‌ విస్తరణ పనుల కోసం అలైన్మెంట్‌ను పరిశీలించారు. ట్రెంచ్‌ కట్టింగ్‌ పనులు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో సురేష్‌, జెడ్పీ సీఈవో నరేందర్‌, అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:04 AM