Share News

ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:48 PM

రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ హామీ ఇచ్చారు. విద్యార్థులే దేశ భవిష్యత్‌కు దిక్సూచి అన్నారు. యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఆరురోజులుగా జరుగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరం శనివారం ముగిసింది.

ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి

కోల్‌సిటీటౌన్‌, సెప్టెంబర్‌ 6(ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ హామీ ఇచ్చారు. విద్యార్థులే దేశ భవిష్యత్‌కు దిక్సూచి అన్నారు. యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఆరురోజులుగా జరుగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణను, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, రాజకీయాల్లోకి యువత రావాలన్నారు. గోదావరిఖనిలో రోడ్ల విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయని, మెడికల్‌ కళాశాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. పీజీ కళాశాలలో వసతిగృహ నిర్మాణానికి కృషి చేస్తాన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం ద్వారా వలంటీర్లు అంకితభావంతో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ చేయడం అభినందనీయమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మనోహర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మహాంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సాంబశివరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రసాద్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ఎం.నరేష్‌, డి.కిరణ్మయి, డి శంకర్‌, అధ్యాపకులు, పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:48 PM