Share News

సామాన్యులకు న్యాయాన్ని అందించేలా కృషి చేయాలి

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:35 AM

సామాన్యులకు సైతం న్యాయ సేవలు అందే లాగా ప్యారా లీగల్‌ వాలంటీర్లు కృషి చేయా లని జిల్లా, సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జరిగిన వలంటీర్ల శిక్షణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు.

సామాన్యులకు న్యాయాన్ని అందించేలా కృషి చేయాలి

పెద్దపల్లి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): సామాన్యులకు సైతం న్యాయ సేవలు అందే లాగా ప్యారా లీగల్‌ వాలంటీర్లు కృషి చేయా లని జిల్లా, సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జరిగిన వలంటీర్ల శిక్షణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిందని, సామాజికంగా వెను కబడిన వర్గాలకు న్యాయ సేవలు అందేలా వలంటీర్లు కృషి చేయాలని కోరారు.

పారా లీగల్‌ వలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి స్వశక్తి సంఘాలకు చెందిన నాయకులు పాల్గొనడం అభినందనీయమన్నారు. అడిషనల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి శ్రీనివాసరావు, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి స్వప్నరాణి, సీని యర్‌ సివిల్‌ జడ్జిలు శ్రీనివాసులు, జీవన సూరజ్‌ సింగ్‌, భవాని, జూనియర్‌ సివిల్‌ జడ్జి సరిత, గణేష్‌, అద నపు డీఆర్‌డీఏ రవీం దర్‌, జీవన్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 12:35 AM