Share News

విద్యార్థుల సామర్థ్యం పెంచేలా కృషి చేయాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:49 PM

ప్రభుత్వ పాఠశాలలపై కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం పెద్దపల్లి సుభాష్‌నగర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదివింది అర్థం చేసుకునే సామర్థ్యం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

విద్యార్థుల సామర్థ్యం పెంచేలా కృషి చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలపై కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం పెద్దపల్లి సుభాష్‌నగర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదివింది అర్థం చేసుకునే సామర్థ్యం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు తయారు చేసిన టీఎల్‌ఎంను ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్న బోధనోపకరణాలు, సామగ్రిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గుణాత్మకమైన బోధనపై దృష్టి సారించి మంచి ఫలి తాలను సాధిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని, వసతులు సమకూర్చా లని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారిని ఆదేశించారు. తహసీల్దార్‌ రాజయ్య, ఏఎంఓ షేక్‌, హెడ్‌ మాస్టర్‌ మనోహర్‌ రావు తదితర అధికారులు ఉన్నారు.

సర్వేయర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలో జరగనున్న జీపీఓ సర్వేయర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం నిర్వహించిన జిపిఓ, లైసెన్స్‌ సర్వేయర్‌ పరీక్షలపై అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రామగిరి జెఎన్టీయూలో జరిగే పరీక్ష కేంద్రానికి ఎస్కార్ట్‌తో తరలించాలన్నారు. ఆదివారం థియరీ పరీక్ష ఉంటుందని, అనంతరం వాటిని హైదరాబాద్‌కు తరలించాల్సి ఉంటుందన్నారు. అలాగే మంగళ, బుధవారాలు ఫీల్డ్‌ టెస్ట్‌ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 29 మంది అభ్యర్థులు రాయనున్నారని, వారికి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేయాలని తెలిపారు.

Updated Date - Jul 24 , 2025 | 11:49 PM