Share News

ఏఐ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:45 PM

ఏఐ ల్యాబ్‌ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం రంగాపూర్‌లోని జిల్లా పరిషత్‌, ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఏఐ కంప్యూటర్‌ ల్యాబ్‌ ను పరిశీలించారు.

ఏఐ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఏఐ ల్యాబ్‌ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం రంగాపూర్‌లోని జిల్లా పరిషత్‌, ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఏఐ కంప్యూటర్‌ ల్యాబ్‌ ను పరిశీలించారు. ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ తరగతి గదిలో సీ గ్రేడ్‌ పిల్లలకు ఆంగ్లం, తెలుగు, గణితం సులభంగా నేర్పించాలని కలెక్టర్‌ తెలిపారు. ఏఐ టూల్స్‌ వినియోగం వల్ల పిల్లల్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. టీచర్‌ స్నేహ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచాలి

ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల్లో 90 శాతం విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందేలా చర్యలు చేపట్టా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలె క్టరేట్‌లో సుల్తానాబాద్‌, ముత్తారం, జూలపల్లి, ధర్మా రం, ఎలిగేడు, కమాన్‌పూర్‌ మండలాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెడ్‌మా స్టర్లతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు రోజు అరగంట తెలుగు, ఇంగ్లీష్‌ స్కిల్స్‌ పెంపుపై దృష్టి సా రించాలన్నారు. పిల్లలకు చదవడం అలవాటు అయ్యే లా ప్రోత్సహించాలన్నారు. లెక్కలకు సంబంధించి మ ల్టిఫ్లికేషన్‌, డివిజన్‌ రావడం లేదని, ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహిస్తూ పురోగతిపై రివ్యూ చేసుకో వాలన్నారు.

పాఠశాలలకు గ్యాస్‌ కనెక్షన్‌ అందించాలి

జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ విద్యాసంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా నూతన గ్యాస్‌ కనెక్షన్‌లు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంపై అధికారులతో సమీక్ష నిర్వ హించారు. దీనిని పేదలందరు సద్వినియోగం చేసుకు నేలా చూడాలన్నారు.

ఈ పథకం కింద రూ.300ల సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో వినియోగదారులకు ప్రతి సిలిండర్‌ కొనుగోలుపై జమ చేస్తారన్నారు. నూతనం గా 23 వేల రేషన్‌కార్డులు జారీ చేశామని, వాటిలో ఎవరికైనా గ్యాస్‌ కనెక్షన్‌ లేనిపక్షంలో అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విద్యాసంస్థలకు గ్యాస్‌ కనెక్షన్‌ సరఫరాకు అవసరమైన నిధులను కలెక్టరేట్‌ నుంచి చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈనెల 25 నాటికి జిల్లాలో కట్టె పొయ్యి లేకుండా చూడాలన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:45 PM