Share News

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:08 PM

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు ఆఫీసు ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి

మంథని, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు ఆఫీసు ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షం సైతం లెక్క చేయ కుండా క్యాంఫు ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. రజ నీకాంత్‌, రాజుకుమార్‌, స్మరన్‌, ఆర్ల సందీప్‌, రాజ్‌ కుమార్‌, సాయితేజ, లక్ష్మన్‌, శశి పాల్గొన్నారు.

పెద్దపల్లి కల్చరల్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నిరసనలు కొనసాగాయి. డిగ్రీ, జూనియర్‌ కళాశాలలోపాటు ఇంజనీరింగ్‌ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు బంద్‌లో పాల్గొనాయి. నాలుగేళ్లుగా విద్యార్థుల ఉపకార వేతనాల బకాయిలు ఇవ్వడంలో ప్రభు త్వం మొండివైఖరి అవలంభిస్తున్నదని నాయకులు పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ రిజిస్టార్‌కు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బీఈడీ లెక్చరర్ల అసోసియేషన్‌ నాయకులు పెన్‌డౌన్‌ చేస్తున్నట్లు వినతి పత్రం అందించారు. దీనికితోడు విద్యార్థి సంఘాల నాయకులు కూడా కళాశాలలో విద్యార్థులను బాయ్‌కాట్‌ చేయించడంతో కళాశాలల బంద్‌ కొనసాగింది.

Updated Date - Nov 04 , 2025 | 11:08 PM