Share News

డంప్‌యార్డ్‌ నిర్వహణ అస్తవ్యస్తం

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:19 PM

సుల్తానాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని నిర్వహిస్తున్న డంప్‌యార్డులో చెత్త చేరుకుపోయింది. ప్రాసె సింగ్‌ లేకపోవడంతో హైదరాబాద్‌లోని సీడీఎంఏకు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌ సంధ్య డంప్‌యార్డును ఆకస్మి కంగా తనిఖీ చేశారు.

డంప్‌యార్డ్‌ నిర్వహణ అస్తవ్యస్తం

సుల్తానాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని నిర్వహిస్తున్న డంప్‌యార్డులో చెత్త చేరుకుపోయింది. ప్రాసె సింగ్‌ లేకపోవడంతో హైదరాబాద్‌లోని సీడీఎంఏకు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌ సంధ్య డంప్‌యార్డును ఆకస్మి కంగా తనిఖీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌తోపాటు ఉద్యోగులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. చెత్త నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్న ఏజెన్సీకి షోకాజ్‌ నోటీసు జారీ చేస్తున్నట్లు జాయింట్‌ డైరెక్టర్‌ తెలిపారు. చెత్తను ప్రాసెసింగ్‌ చేసేందుకు సాగర్‌ మోటార్స్‌ ఏజెన్సీ కాం ట్రాక్టు దక్కించుకుందని వివరించారు. సీడీఎంఏ కమిషనర్‌ శ్రీదేవి ఆధ్వ ర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ పరి ధిలోని డంపింగ్‌ యార్డులను తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని చెప్పారు. సుల్తానాబాద్‌ డంప్‌యార్డ్‌ను తనిఖీ చేశామన్నారు. కాంట్రాక్టు సంస్థకు 20 రోజుల సమయాన్ని ఇస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వివరించారు.

Updated Date - Oct 17 , 2025 | 11:19 PM